HomeసినిమాRajinikanth: విజయ్ జన నాయగన్ పై ఎట్టకేలకు స్పందించిన రజనీకాంత్..

Rajinikanth: విజయ్ జన నాయగన్ పై ఎట్టకేలకు స్పందించిన రజనీకాంత్..

తమిళ సినిమా ఇండస్ట్రీలో.. జన నాయగన్ సినిమా లీక్ వార్త పెద్ద సంచలనం సృష్టించింది. హీరో విజయ్ నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాకముందే ఆన్‌లైన్‌లో బయటకు రావడం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఎన్నో వివాదాలు తరువాత ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని విజయ్ అభిమానులు ఎదురుచూస్తున్న..ఈ సినిమా నిన్నటికి నిన్న ఆన్లైన్లో లీక్ అయ్యింది అన్న వార్త అందరిని ఆందోళనకు గురిచేసింది.

  • ఫైనల్ గా రజినీకాంత్ స్పందన..!

ఈ క్రమంలో ఈ విషయం గురించి ఎంతోమంది హీరోలు స్పందిస్తూ ఉండగా.. తమిళ సూపర్ స్టార్స్ అయిన రజినీకాంత్, కమల్ హాసన్ మాత్రం స్పందించకపోవడం ఈరోజు ఉదయం నుంచి కొన్ని విమర్శలకు కారణమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “జన నాయగన్ సినిమా ఇలా ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడం బాధాకరం. ఇది సినిమా రంగానికి పెద్ద నష్టం. ఇలాంటి పనులు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు, సినిమా సంఘాలు కలిసి చర్యలు తీసుకోవాలి” అని ఆయన అన్నారు.

https://x.com/i/status/2042621670465376520

  • మెగాస్టార్ చిరంజీవి కూడా..!

ఈ ఘటనపై ఇతర నటులు కూడా స్పందించారు. హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ “ఒక సినిమా వెనుక ఎన్నో మంది కష్టం ఉంటుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండండి. థియేటర్లలోనే సినిమాను చూడండి” అని అభ్యర్థించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఘటనను ఖండిస్తూ, “సినిమాను రక్షించడం మనందరి బాధ్యత” అని చెప్పారు. ఇదిలా ఉండగా, సినిమా నిర్మాతలు ఇప్పటికే లీగల్ యాక్షన్ ప్రారంభించారు. అనధికారంగా సినిమా డౌన్‌లోడ్ చేయడం లేదా షేర్ చేయడం చట్టపరంగా శిక్షార్హం అని వారు హెచ్చరించారు. ఈ సినిమా మొదట సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు లీక్ అవ్వడంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు