Homeఅంతర్జాతీయంహ‌ర్మూజ్‌పై 15 నౌక‌ల‌కు అనుమ‌తి....ఖ‌మేనీ మ‌ర‌ణానికి ప్ర‌తీకారం త‌ప్ప‌దు...! ఇరాన్ సుప్రీం లీడ‌ర్

హ‌ర్మూజ్‌పై 15 నౌక‌ల‌కు అనుమ‌తి….ఖ‌మేనీ మ‌ర‌ణానికి ప్ర‌తీకారం త‌ప్ప‌దు…! ఇరాన్ సుప్రీం లీడ‌ర్

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్ :హ‌ర్మూజ్ జ‌ల‌సంధిపై రోజుకు 15నౌక‌ల‌కు అనుమ‌తిస్తున్న‌ట్లు ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ముజ్తాబా ఖ‌మేనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హోర్ముజ్ జలసంధి నిర్వహణలో కొత్త దశకు చేరుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన హోర్ముజ్ నిర్వహణలో ఇది ఇరాన్‌కు ఒక కీలకమైన నూతన అధ్యాయమని ఆయన అభివర్ణించారు. తమ దేశం పై చేసిన వారిని శిక్షించ‌కుండా వ‌దిలిపెట్ట‌మ‌ని, యుద్దంలో టెహ్రాన్ జ‌రిగిన‌ష్టాల‌కు ప‌రిహారం కోరాల‌ని భావిస్తోందని తెలిపారు. ‘జరిగిన నష్టానికి, అమరవీరుల త్యాగాలకు, యుద్ధంలో గాయపడిన వారికి పరిహారం కోసం మేము కచ్చితంగా డిమాండ్ చేస్తాము’ అని ఆయన అన్నారు.

ఇరాన్ యుద్దం కోరుకోవ‌డం లేదు…

ఇరాన్ యుద్దం కోరుకోవ‌డం లేద‌ని, త‌న తండ్రి అయుతుల్లా అలీ ఖ‌మేనీ మ‌ర‌ణానికి ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని పేర్కొన్నారు. త‌మ హ‌క్క‌ల‌ను ఏ మాత్రం వ‌దులుకోబోమ‌ని స్ప‌ష్టం చేశారు. ఇక, హోర్ముజ్ విషయంలో ఐఆర్‌జీసీ కొత్త రూల్స్ తెరపైకి తెచ్చింది. అమెరికాతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని హోర్ముజ్‌‌లో ప్రతీ రోజు కేవలం 15 నౌకలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకుంది. అది కూడా ఇరాన్ అనుమతి తీసుకున్న నౌకలకు మాత్రమే హోర్ముజ్‌లో ప్రయాణించే అవకాశం కల్పించనుంది.

తాజావార్తలు