Homeఆంధ్ర ప్రదేశ్ప్రేమ‌కు నిర్వ‌చ‌నం ఈ యువ జంట‌... గుణంలో చూసింది అందాన్నీ ...!

ప్రేమ‌కు నిర్వ‌చ‌నం ఈ యువ జంట‌… గుణంలో చూసింది అందాన్నీ …!

మ‌చిలిప‌ట్నం, క్రైమ్ మిర్ర‌ర్: సినిమాల్లో, క‌థల్లో ఎక్కువ చూస్తుంటాం ప్రేమ‌కు రూపం, రంగు, హ‌ద్దులు ఉండ‌వ‌ని వినే ఉంటాం. అలాంటి క‌థ‌నే త‌ల‌ద‌న్నేలా నిజ జీవితంలో జ‌రిగింది. మ‌చిలిప‌ట్నానికి చెందిన ఓ ముస్లం యువ‌తి త‌న ప్రేమ కోసం స‌మాజానికి ఆద‌ర్శంగా నిలిచింది.ప్రేమకు రూపం, ఎత్తు, అందం వంటి భేదాలు లేవని, కులం–మతం కూడా అడ్డుకావని ఈ జంట మరోసారి నిరూపించింది. రాజుపేట‌కు చెందిన ముస్లీం యువ‌తి మ‌రుగుజ్జు వ్య‌క్తిని ప్రేమించి వివాహం చేసుకోవ‌డం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది.

కాగా అదే ప్రాంతానికి చెందిన వేముల శ‌శి, ముస్లీం యువ‌తి మ‌ధ్య 9వ త‌ర‌గ‌తిలో మొద‌లైన స్నేహం క్ర‌మంగా ప్రేమ‌గా మారి ఇప్ప‌డు వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు. యువకుడు జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, యువతి మెడికల్ షాప్‌లో పనిచేస్తోంది. ప్రేమలో ఎలాంటిఅడ్డంకులు లేవని నమ్మిన ఈ జంట తమ నిర్ణయంపై నిలబడింది. ప‌లువురికి ఆద‌ర్శంగా నిలిచింది. ప్రేమ ఎంత గొప్ప‌దో స‌మాజానికి చాటి చెప్పింది. వీరి ప్రేమ వివాహానికి పెద్ద‌ల నుంచి అంగీకారం ల‌భించ‌లేదు.

యువ‌తి తల్ల‌దండ్రులు, బంధ‌వులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు.ఈ క్ర‌మంలో యువ జంట కుటుంబ స‌భ్య‌ల నుంచి ప్రాణ హాని ఉంద‌ని బావించి ఇసుకుదురుపేట పోలీసుల‌ను ఆశ్ర‌యించి త‌మ‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పోలీసుల‌ను కోరింది. ప్రేమ‌కు హ‌ద్ద‌లు లేవ‌ని నిజ‌మైన అనుబంధం ఉంటే మ‌తం, కులం, రంగు, వ‌య‌స్సు ఎలాంటి అడ్డంకులు ఎదురైన డాట‌వ‌చ్చ‌ని మ‌రోసారి చాటి చెప్పింది.

ఇవి కూడా చదవండి ….

  1. Telangana: ఆధ్యాత్మిక రాజకీయం…!

  2. Revanth Master Plan: త్రిశూల్ వ్యూహం.. బల్దియా పై రేవంత్ స్పెషల్ గురి!

  3. Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణకు బ్రేక్.. ఆశావహులపై సీఎం రేవంత్ నీళ్లు!

  4. Telangana: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు…!

  5. ఆ మత మార్పిడిల వెనుక జగన్…?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments