క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకీ గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే సెలవు అయినప్పటికీ కూడా విద్యార్థులతో కలిసి నిర్వహించడం జరిగింది. ముందుగా బడిబాట కార్యక్రమం యొక్క కరపత్రమును గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ మరియు కరపత్ర దాతలు బత్తుల శ్రీనివాస్ ,ఏఏపీసీ చైర్ పర్సన్ పులగం సులోచన,పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డిలు సంయుక్తంగా ఆవిష్కరించడం జరిగింది. తదుపరి బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో వారి పిల్లలను చేర్పించాలని కోరడం జరిగింది. వారి నుండి మంచి స్పందన రావడం జరిగింది. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విలువైన ఉచిత విద్య లభిస్తుందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు ఆలోచించి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి పాఠశాల బలోపేతానికి సహకరించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ,మందుగుల వెంకటయ్య,కొసన మాధవి, నకిరేకంటే అశ్విని పాల్గొనడం జరిగింది.
M. A. Sharif: అప్పటి దాడి.. ఇప్పుడు వెలుగులోకి, బయటపెట్టిన ఎంఎ షరీఫ్!
YSRCP MLCs Resignations: వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం.. కోర్టు ఆదేశాలతో నిర్ణయం అనివార్యం!
