ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: బాంబులతో మోతలతో రణరంగా మారుతున్న తరుణంలో అమెరికా చేసిన 48 గంటల కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించింది. ప్రస్తుతం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ వైఖరి మరింత కఠినంగా మారుతోందనడానికి ఈ తిరస్కరణ నిదర్శనంగా కనిపిస్తోంది. కాగా బుధవారం ఒక మధ్యవర్తి దేశం ద్వరా ఇరాన్‌కు అమెఎరికకా ఈ సందేశం పంపినట్టు సమాచారం.
ఈ దౌత్య ప్రయత్నాలు విఫలం అయిన వెంటనే సైనిక ఘర్షణలు మరింత తీవ్రం అయ్యాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన రెండు అత్యాధునిక ఫైటర్ జెట్‌లను కూల్చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇక, ఇరాన్‌లోని మౌలిక వసతులపై అమెరికా భీకర దాడులు చేసింది. ప్రస్తుత ఘర్షణల సమయంలో ఇరాన్ గగనతలంపై ఒక అమెరికా విమానం కూలిపోవడం ఇదే మొదటిసారి. అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానానికి చెందిన ఫొటోలను ఇరాన్ మీడియా విడుదల చేసింది
ఆ శిథిలాలు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్ విమానానికి చెందినవేనని అమెరికా మీడియా తేల్చింది. గత 24 గంటల్లో ఇది రెండోదని, మొత్తంగా మూడో ఎఫ్-35ని అమెరికా నష్టపోయిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. కూలిపోయిన యుద్ధ విమానం శకలాలను, పైలట్లను గుర్తించేందుకు అమెరికా బ్లాక్ హాక్ హెలికాప్టర్, సీ-130 హెర్క్యులస్ విమానాలతో గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో వాటిపైనా ఇరాన్ డ్రోన్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులను ప్రయోగించింది
