Homeతెలంగాణహ‌రీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్‌...రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం...!

హ‌రీశ్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్‌…రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం…!

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్ః బీఆర్ ఎస్ మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిన్న‌టి వ‌ర‌కు కేటీ ఆర్‌, క‌విత‌ల‌పైనే విమ‌ర్శ‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి తాజా రూటు మార్చారు. ముఖ్యంగా హ‌రీశ్‌రావునే టార్గెట్ చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. ఎప్పుడు లేని విధంగా హ‌రీశ్‌పై భూ క‌బ్జాల‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు చేయ‌డం వెనుక పెద్ద రాజ‌కీయ కుట్ర‌నే దాగి ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.

.రేవంత్ రెడ్డి నేరుగా పేరు ఎత్తకపోయినా, హరీష్ రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. కన్న తండ్రిని పట్టించుకోని వారు.. ప్రజలను ఏం పట్టించుకుంటారు అనే అర్థం వచ్చేలా రేవంత్ చేసిన ఆరోపణలు హరీష్ రావును తీవ్రంగా ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావుపై ఇలాంటి వ్యక్తిగత , అవినీతి ఆరోపణలు రావడం ఆయన ఇమేజ్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ప్రభుత్వం ఇప్పటికే హరీష్ అనుచరులు, ఆయనకు సంబంధించిన భూ వ్యవహారాలపై విచారణకు ఆదేశించడం ఆయనను మరింత ఒత్తిడిలోకి నెట్టింది.

ఈ పరిణామాల మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కొత్త ట్విస్ట్‌ను ఇచ్చాయి. రేవంత్ రెడ్డి కావాలనే హరీష్ రావును ఒంటరిని చేస్తున్నారని, కేటీఆర్ మరియు కవితలతో రేవంత్ కున్న రహస్య ఒప్పందంలో భాగంగానే ఈ వ్యూహం నడుస్తోందని సంజయ్ ఆరోపించారు. అంటే, బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి, కల్వకుంట్ల కుటుంబంలోని అంతర్గత విభేదాలను రేవంత్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్నది బీజేపీ వాదన. ఈ ఆరోపణల్లో నిజమెంత ఉన్నా, రేవంత్ రెడ్డి ఒక్కసారిగా హరీష్ పై పడటం వెనుక బీఆర్ఎస్ కేడర్‌ను గందరగోళానికి గురిచేసే ప్లాన్
స్పష్టంగా కనిపిస్తోంది.ప్రస్తుతానికి పరిస్థితులు హరీష్ రావుకు వ్యతిరేకంగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి.

అటు ప్రభుత్వపరంగా విచారణలు, ఇటు రాజకీయంగా సొంత పార్టీలోనే ప్రాధాన్యత తగ్గిపోతోందన్న ప్రచారం ఆయనను ఆత్మరక్షణలో పడేశాయి. కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే హరీష్ రావుపై ఈ స్థాయిలో దాడులు జరగడం యాదృచ్ఛికం కాదని రాజకీయ పండితులు భావిస్తున్నారు. హరీష్ రావుకు ఉన్నమాస్ ఇమేజ్‌ను దెబ్బతీయడం ద్వారా బీఆర్ఎస్‌ను బలహీనపరచవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.ఎన్నికల సమయంలో లేదా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సంక్షోభాలను చక్కదిద్దే హరీష్ రావు, ఇప్పుడు తన సొంత రాజకీయ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. రేవంత్ రెడ్డి విసురుతున్న సవాళ్లను ఆయన ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments