ముంబై, క్రైమ్ మిర్రర్: ఎన్డీయే మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్స్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ మద్దతుతో ఎన్డీఏ సర్కార్ వచ్చే ఛాన్స్ ఉందని అని వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో విజయ్ చేరుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత మద్దతు కోరుతాం. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే గట్టిపోటీ ఇస్తుంది. హంగ్ ఏర్పడితే టీవీకే ఎన్డీఏలో చేరుతుందని పేర్కొన్నారు.
పుదుచ్చేరిలో ఇండియా రిపబ్లికన్ పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం అనంతరం అథవాలే మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాదు. తమిళనాడులో మెజారిటీ సాధించకపోతే ఎన్డీఏ కూటమి విజయ్ మాట్లాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
ప్రస్తుతం కేరళంను అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. అక్కడ కూడా బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎన్నికల తర్వాత, ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోదీ దేశానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలో ఉన్నారు. దేశాభివృద్ధియే ఆయన ‘లక్ష్యం’అని ఆయన అన్నారు.
టీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. పొత్తును ఖరారు చేసేలా చర్చలు ఎన్డీఏ పెద్దలు ఓ దూతను విజయ్ వద్దకు పంపించారు. ఎన్డీఏ కూటమి తరుపున సదరు నేత విజయ్ చర్చలు జరిపారు. విజయ్తో చర్చలు సఫలం కాలేదు. ఆ చర్చల్లో భాగంగా విజయ్ రెండున్నర సంవత్సరాలు, అన్నాడీఎంకే ఎడప్పాడి పళనిస్వామి మరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేలా మంతనాలు జరుగగా దీనికి ఆయన అంగీకరించలేదు.
దీంతో, విజయ్ పొత్తు కోసం బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైంది. విజయ్ ఒంటరిగా ఎన్నికల పోటీ చేస్తున్నారు. తాజా, పరిణామల నేపథ్యంలో తమిళనాడులో ఎన్డీఏ కూటమికి మెజారిటీ రాకపోతే విజయ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రామ్ దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
