HomeజాతీయంBJP Politics : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ గురి!

BJP Politics : దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ గురి!

  • వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాది రాష్ట్రాల్లో తగ్గనున్న బలం

  • దానిని భర్తీ చేసేందుకు సౌత్ స్టేట్స్ పై ఫోకస్

  • హిందుత్వవాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ గురి పెట్టిందా? వచ్చే ఎన్నికల నాటికి గణనీయమైన సీట్లతోపాటు ఓట్లు పెంచుకోవాలని చూస్తోందా? కేరళ తో పాటు తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని భావిస్తోందా? ఏపీ, తమిళనాడులో భాగస్తులతో కలిసి ఎక్కువ సీట్లు పొందాలని చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో భారీగా అసెంబ్లీతోపాటు లోక్సభ నియోజకవర్గాలు పెరగనున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు మిత్రులకు వదిలి.. ఎంపీ సీట్లు మాత్రం ఎక్కువగా తీసుకోవాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. అయితే ఇప్పుడు బీజేపీ ఎంట్రీ తో మతపరమైన రాజకీయాలు మొదలవుతాయని ఒక అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాల్లో మతం అనే అంశం పనిచేయలేదు. ఇప్పుడు మత ప్రాదిక రాజకీయాలు మొదలయితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవన్న విశ్లేషణలు ఉన్నాయి.

  • ఉత్తరాది రాష్ట్రాల్లో బలం..

గత దశాబ్ద కాలంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టు బిగించింది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ నుంచి యూపీ వరకు అన్ని రాష్ట్రాల్లో సత్తా చాటింది. చివరకు ఒడిస్సా లాంటి రాష్ట్రంలో సైతం జెండా పాతింది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రాగలిగింది. అయితే రాజకీయాలు ప్రతి పదేళ్లకు ఒకసారి మారుతుంటాయి. అందుకే ఉత్తరాది రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలం తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఆ పార్టీకి గణనీయంగా బలం తగ్గింది. మరోసారి అదే పరిస్థితి వస్తే దక్షిణాది రాష్ట్రాల ద్వారా భర్తీ చేసుకోవాలని గట్టి ప్రయత్నం లో ఉంది భారతీయ జనతా పార్టీ.

  • మత ప్రాతిపదిక రాజకీయాలు..

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో మత ప్రాతిపదికన రాజకీయాలను చేయాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా తమిళనాడుతో పాటు తెలంగాణలో హిందుత్వ వాదాన్ని బలంగా వినిపిస్తోంది. అయితే అది అధికారాన్ని దగ్గర చేస్తుందా? లేదా? అనేది ఒక అనుమానం. ఎందుకంటే మత ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాల్లో ఇంతవరకు రాజకీయాలు జరగలేదు. కుల పరమైన రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి కానీ మతపరంగా ఎక్కువగా ఉండవు. కానీ ఇప్పుడు హిందుత్వ వాదాన్ని వినిపించడం ద్వారా గట్టిగానే ప్రయత్నిస్తోంది బిజెపి. అయితే ఇప్పుడు ప్రజల్లో హిందుత్వవాదం పెరుగుతోంది. హిందువులు ఏకమైతే మాత్రం బిజెపి వ్యతిరేక పార్టీలకు ఇబ్బందికరమే.

  • దక్షిణాది నుంచి కనీసం 200…

800 కు పైగా పార్లమెంట్ స్థానాలు పెరగనున్నాయి పునర్విభజనతో. అంటే దాదాపు 450 కి పైగా పార్లమెంట్ స్థానాలు రావాలి. కనీసం దక్షిణాది రాష్ట్రాల నుంచి 150 నుంచి 200 సీట్లు తెచ్చుకుంటే బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ సేఫ్ జోన్ లో ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉంది బిజెపి. సొంతంగా గెలవాలనుకుంటున్న తెలంగాణతో పాటు కర్ణాటకలో అయితే దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. తమిళనాడుతో పాటు ఏపీలో మిత్రుల ద్వారా గట్టక్కాలని చూస్తోంది. కేరళలో సైతం గణనీయమైన ఓట్లతో పాటు సీట్లు పెంచుకోవాలని భావిస్తోంది. మరి బిజెపి ఈ ప్రయత్నాల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

  1. BJP, BRS : బిజెపిలో ‘పొత్తు’ కలకలం!

  2. Goshamahal Mla : రాజాసింగ్ దూకుడు!

  3. Ysrcp : వల్లభనేని వంశీ మోహన్ కు పొమ్మన లేక పొగ!

  4. RadhaKrishna : ఎట్టకేలకు వంగవీటి వారసుడికి అదృష్టం!

  5. చంద్రబాబుకు పాదాభివందనం చేసిన కాంగ్రెస్ నేత హనుమంత రావు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments