క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:-
ఐపీఎల్ సీజన్ 19 మరో 3 రోజులలో ప్రారంభం కానుంది. ఇప్పటినుంచి ఆయా జట్లకు సంబంధించి ప్లేయర్ లందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఈసారి సమ్మర్ కు వినోదాన్ని అందించే క్రమంలో అంతా సిద్ధం చేసుకుంటున్నారు. నిన్నటి వరకు ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ అందుబాటులో ఉండడు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ జట్టు కెప్టెన్ పాట్ కమీన్స్ వెన్న నొప్పి నుంచి కోలుకుని ఐపీఎల్ ఆడడానికి సిద్ధమయ్యారు. వెన్ను నొప్పి తగ్గిన కారణం చేత ఐపీఎల్లో ఆడేందుకు ఆస్ట్రేలియా అతనికి అనుమతి ఇచ్చింది అని తాజాగా క్రిక్బజ్ వెల్లడించింది. ఈనెల 28వ తేదీన మొదటి మ్యాచ్లో బెంగళూరు తో హైదరాబాద్ జట్టు తలపడనుంది. అయితే మొదటి మ్యాచ్ లో ఫ్యాట్ కమ్మిన్స్ఆడుతారా?.. లేదా?.. అనే విషయం పై క్లారిటీ రాకపోయినప్పటికీ జట్టులో చేరిన పాట్ కమ్మిన్స్ విషయం తెలుసుకున్న ఫాన్స్ ముఖాల్లో వెలుగులు వచ్చాయి. కెప్టెన్ రాకతో.. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు మరింత జోష్ అందుకుంది. ఈసారి కచ్చితంగా 300 పరుగులు చేస్తారు అని.. ఫ్యాన్స్ సైతం ధీమాతో కామెంట్లు చేయడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. మరి ఈసారైనా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కప్పు కొడుతుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ఏడాది 300 స్కోర్ను నమోదు చేసి రికార్డు సృష్టిస్తుందా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.
షూటింగ్ లో రామ్ చరణ్ కు గాయాలు..?
ఇది భారత్ పవర్.. మన దేశాన్ని ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి : ప్రధాని మోదీ
