Tuesday, March 24, 2026
Homeతెలంగాణగ్యాస్ కు ఎందుకు ఎక్కువ వసూలు చేస్తున్నారు..!

గ్యాస్ కు ఎందుకు ఎక్కువ వసూలు చేస్తున్నారు..!

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్

క్రైమ్ మిర్రర్, మునుగోడు: గ్యాస్ కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు తధ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం నాడు ఆయన నల్గొండ జిల్లా మునుగోడు లో గ్యాస్ కు అధికంగా వసూలు చేస్తున్న సాయి దుర్గ గ్యాస్ ఏజెన్సీ కి వారి ని నిలదేశారు.

ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..గరిష చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేసే గ్యాస్ మాఫియా పై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండ లో గ్యాస్ వినియోగదారులను నిరీక్షణ చేయించడం భావ్యం కాదని మాచన రఘునందన్ స్పష్టం చేశారు.

గ్యాస్ తమకు డోర్ డెలివరీ కావడం లేదు,అధికంగా వసూలు చేస్తున్నారు.అని పలువురు ఆరోపణ చేయగా వారి నుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకున్నారు.గ్యాస్ డెలివరీ సమయం లో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని రఘునందన్ వినియోగదారులకు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments