Homeఆంధ్ర ప్రదేశ్రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించిన... గంటకి కుమారుని జననం..!

రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించిన… గంటకి కుమారుని జననం..!

ఆంధ్రప్రదేశ్లో ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు తండ్రి మరణించాడు మరణించిన గంటలోపే కొడుకు జన్మించాడు. తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా అతన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మరణించాడు. అయితే అతను మరణించిన గంటకి తన భార్య కొడుకుకి జన్మనిచ్చింది. ఈ విషయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెగ వైరల్ అవుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణలోని గద్వేల్ జిల్లా రాజోలు మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి శివ కు అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కర్నూలు జిల్లా లోని బలపాలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ అనే యువతితో ఏడాది క్రితం ఘనంగా పెళ్లి జరిగింది. అయితే మంగళవారం పూట శివ తుమ్మలపల్లి గ్రామం నుండి రాజోలుకి బైకుపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే కర్నూల్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే శివా చికిత్స పొందుతూ బుధవారం ఆస్పత్రిలోనే మరణించాడు. అయితే ఇక్కడే ఇంకొక సంఘటన జరిగింది. శివ చనిపోయిన ఒక గంట తరువాత తన భార్య లక్ష్మి కి పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రిలోనే ఒక కొడుకుకి జన్మనిచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనలు అంతా ఇంతా కాదు. అటు భర్త చనిపోయాడని బాధలో లేదా ఇటు భర్త రూపంలో కొడుకు జన్మించాడు అనే సంతోషంలో ఉండాలో లేదో తెలియక భార్య విలవిలలాడిపోయింది. ఈ సంఘటన చూస్తూనే ఉన్న కుటుంబ సభ్యులు బాధ చెప్పుకోలేనటువంటిది కాదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments