Homeఅంతర్జాతీయంతమిళనాడు ప్రచార బాధ్యతలు పవన్ కళ్యాణ్ కు...!

తమిళనాడు ప్రచార బాధ్యతలు పవన్ కళ్యాణ్ కు…!

  • బీజేపీ పెద్దల నుంచి ప్రత్యేక ఆహ్వానం

  • బలమైన ద్రవిడ సిద్ధాంతాన్ని ఢీ కొట్టేందుకు పవన్ సనాతన నినాదం

  • ఢిల్లీ పెద్దల వ్యూహం అదే

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది బిజెపి హై కమాండ్. తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ప్రచార బాధ్యతలు అప్పగించింది. అక్కడ ఎన్నికల్లో పవన్ సేవలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో అధికార డిఎంకె కూటమి దూకుడు మీద ఉంది.

ఇంకోవైపు అన్నా డిఎంకె నేతృత్వంలోని ఎన్డీఏ తలపడుతోంది. విజయ్ టీవీ కే ఎంట్రీ తో అక్కడ త్రిముఖ పోరు ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఓట్లతో పాటు సీట్లను పెంచుకోవాలని చూస్తోంది తమిళనాడులో.

ఏ చిన్న అవకాశం ఉన్న జార విడుచుకోవడం లేదు. అందులో భాగంగా అక్కడ పవన్ కళ్యాణ్ ను ప్రయోగిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటించారు. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కువ రోజులు తమిళనాడులో గడపనున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడులో మార్పు..
హిందుత్వ అజెండాతో ముందుకు సాగాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. గత కొంతకాలంగా తమిళనాడు ఓటర్లలో మార్పు స్పష్టంగా కనిపించింది. ద్రవిడ సిద్ధాంతాల కంటే హిందుత్వవాదం వైపు అక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది.

ఎందుకంటే దశాబ్దాల ద్రవిడ సిద్ధాంతం నేపథ్యంలో అన్య మతాలు ఎక్కువయ్యాయని.. హిందువుల విషయంలో అక్కడ వివక్ష కనబడుతోందని స్పష్టం అవుతోంది. ఈ తరుణంలో సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం అక్కడ బాగానే పనిచేస్తుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బిజెపి గణనీయంగా పుంజుకుంది.

సీట్ల పరంగా వెనుకబడినా.. ఓట్ల పరంగా మాత్రం షేర్ పెంచుకుంటూ పోయింది. ఏకంగా 14 శాతం ఓట్లను సాధించింది. అందుకే ఈసారి మిత్రులతో కలిసి వెళ్తోంది. ఓట్లతో పాటు సీట్లు పెంచుకుంటే భవిష్యత్తులో తమిళనాడుపై పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీకి.

ఆది నుంచి పవన్ గురి..
తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బిజెపి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బిజెపి కేంద్ర నాయకత్వం నుంచి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ఆహ్వానం పంపినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర బిజెపి నాయకత్వం పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా మాట్లాడింది.

ఆయన చాలా రోజుల కిందట నుంచి తమిళనాడును టార్గెట్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అన్న ప్రతిసారి తమిళనాడు నుంచి ద్రవిడ సిద్ధాంత నేతలు బయటకు వస్తున్నారు. కేవలం హిందుత్వ జండాతో బిజెపి ముందుకు వెళుతున్నందున.. పవన్ కళ్యాణ్ అయితే చరిష్మాతో పాటు సనాతన ధర్మం నినాదం పనిచేస్తుందని బిజెపి హై కమాండ్ ఒక అంచనాతో ఉంది.

మంచి చరిష్మ..
పవన్ కళ్యాణ్ కు స్టార్ హీరోగా మంచి చరిష్మ ఉంది. మొన్నటి ఎన్నికల్లో శత శాతం విజయంతో జనసేన జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా పొందింది. ఏపీకి పక్క రాష్ట్రంగా ఉండగా.. తమిళనాడులో సైతం పవన్ అభిమానులు అధికం. పైగా తెలుగు ప్రజలు ఓ 30 నుంచి 50 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేయగలరు.

అటువంటి చోట పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం తప్పకుండా వర్కౌట్ అవుతుంది అనేది బిజెపి అంచనా. పైగా అక్కడ సినీ పరిశ్రమతో సైతం మంచి సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కు. బలమైన హిందుత్వవాదంతో బిజెపి.. సనాతన ధర్మ పరిరక్షణతో పవన్ కళ్యాణ్ గట్టిగానే పనిచేస్తారు అనేది బిజెపి అంచనా పెట్టుకుంది.

బలమైన ద్రవిడ సిద్ధాంతాన్ని ఢీ కొట్టాలంటే పవన్ కళ్యాణ్ అయితే సరిపోతారని బిజెపి పెద్దలు భావించారు. అందుకే అక్కడ పవన్ కళ్యాణ్ కు ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో??

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు