Monday, March 23, 2026
Homeతెలంగాణబీజేపీ నేతల ముందస్తు అరెస్ట్‌ అక్రమం

బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్‌ అక్రమం

తుర్కయంజాల్‌, మార్చి 23: రేవంత్‌ సర్కార్‌ అరాచక పాలనకు, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతల ముందస్తు అరెస్టులే నిదర్శనమని భారతీయ జనతాపార్టీ తుర్కయంజాల్‌ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో నరసింహారెడ్డితో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు పొట్టి రాములు, తూళ్ల నర్సింహా గౌడ్‌, బచ్చిగళ్ల రమేష్‌, కొండ్రు పురుషోత్తం, నందగిరి సురేష్‌ను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేసి, ఆదిభట్ల పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నేతలను ముందస్తు అరెస్ట్‌ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్‌ సర్కార్‌ భ్రష్టుపట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల బతుకులను ఆగం చేస్తూ… భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని విమర్శించారు. తమ నేతలను ఇళ్ల వద్ద కాపుగాసి అరెస్టులు చేయడం దారుణమన్నారు. పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడితే భయపడేది లేదన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకు బీజేపీ పోరాటం ఆగదని హెచ్చరించారు. అరెస్టు చేసిన తమ నేతలను వెంటనే విడిచిపెట్టాలని నరసింహారెడ్డి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments