శాశ్వతంగా పక్కనపెట్టేలా మహేశ్‌పై రంగం సిద్దం…
విజయవాడ, క్రైమ్ మిర్రర్: టీడీపీ ఎంపీగా ఉండి చెడు వ్యవహారంతో డ్రగ్స్ తీసుకున్నాడనే విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన విషయం తెలిసిందే. టీడీపీలో ఎంతటి వారైన క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీనుంచి సస్పెండ్ చేస్తుంది. తాజాగాడ్రగ్స్ వివాదంలో చిక్కుకున్న పుట్టా మహేష్ యాదవ్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి చూస్తుంటే, ఆయన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేసింది. “పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే వాళ్లను మోయాలా?” అంటూ బాబు వేసిన ప్రశ్న మహేష్‌పై వేటుకు రంగం సిద్దమైందని చెప్పవచ్చు.
తిరుపతి జిల్లా నేతతో జరిగిన భేటీలో చంద్రబాబు ఆవేశం కట్టలు తెంచుకుంది. సాధారణంగా ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు ఆచి తూచి స్పందించే బాబు, ఈసారి మాత్రం ఏకంగా “పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? డ్రగ్స్ తీసుకోవడం ఏంటి?” అని నిలదీశారు. పుట్టా మహేష్ వ్యవహారం కేవలం ఒక వ్యక్తి పొరపాటు కాదని, అది ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే అంశమని అధిష్టానం భావిస్తోంది.
పుట్టా సుధాకర్ యాదవ్ వంటి విధేయుడైన నేతకు తనయుడిగా, యనమల రామకృష్ణుడు వంటి దిగ్గజానికి అల్లుడిగా మహేష్‌కు పార్టీలో రెడ్ కార్పెట్ పరిచారు. కానీ, ఆ గౌరవాన్ని కాపాడుకోవడంలో ఆయన విఫలమయ్యారు. కుటుంబ నేపథ్యం చూసి అవకాశం ఇచ్చాం, కానీ దాన్ని దుర్వినియోగం చేశారని బాబు తెలిపారు.
తప్పు చేస్తే వేటు తప్పదు…
గతంలో కూడా తప్పు చేసిన వారిని ఉపేక్షించలేదని గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా అదే కఠిన ఫార్ములాను అమలు చేసేందుకు బాబు మొగ్గు చూపుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ కల్చర్‌పై యుద్ధం ప్రకటిస్తున్న తరుణంలో, సొంత పార్టీ నేతే ఆ ఆరోపణల్లో ఉండటం బాబుకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది.
అందుకే, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ముందే సర్జరీ చేసేయాలని అధిష్టానం భావిస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదా షోకాజ్ నోటీసులతో మొదలుపెట్టి, శాశ్వతంగా పక్కన పెట్టేలా రంగం సిద్దంమైందని రాజకీయా వర్గాల్లో చర్చ జరుగుతుంది..పుట్టా మహేష్ పై తీసుకోబోయే చర్య కేవలం ఆయనకు మాత్రమే పరిమితం కాదు.
పార్టీ ముసుగులో విచ్చలవిడిగా ప్రవర్తించే మిగిలిన యువ నేతలకు ఇదొక హెచ్చరిక. పార్టీ క్రమశిక్షణ రేఖ దాటితే కుటుంబంతో సంబంధం లేకుండా బహిష్కరణ తప్పదని ఈ ఘటనతో బాబు నిరూపించబోతున్నారని సమాచారం.మొత్తానికి పుట్టా మహేష్ వ్యవహారం టీడీపీలో ఒక పెద్ద కుదుపుకు దారితీసింది.