Homeతెలంగాణదారుణం: రంగారెడ్డి జిల్లాలో ప‌రుగులు తీసిన జనాలు..!

దారుణం: రంగారెడ్డి జిల్లాలో ప‌రుగులు తీసిన జనాలు..!

రంగారెడ్డి, క్రైమ్ మిర్ర‌ర్:  భూ ప్ర‌కంప‌న‌ల‌తో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గురైన ఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రంగా జిల్లాలోని చేవేల్ల ప‌ట్ట‌ణంతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో శుక్ర‌వారం ఉద‌యం 9.30గంట‌ల ప్రాంతంలో ఒక్క‌సారి భారీ శ‌బ్దం వినిపించింది. భూమి కంపించ‌డంతో ఏంజ‌రుగుతుందోన‌ని ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురై బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు.

శుక్ర‌వారం ఉద‌యం అక‌స్మ‌త్తుగా శ‌బ్దం వినిపించింద‌ని స్థాన‌కులు తెలిపారు కాగా భూ ప్ర‌కంప‌న‌ల‌కు ఇంటిలోనివ‌స్త‌వులు క‌దల‌డం,పాత్ర‌లు కింద ప‌డ‌డంతో జ‌నం భ‌యంతోవీధుల్లోకి వ‌చ్చారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది భూకంపమా లేక సమీపంలోని క్వారీల్లో జరిగిన పేలుళ్ల వల్ల వచ్చిన ప్రకంపనలా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

తాజావార్తలు