Homeసినిమాఈ ఏడాదే అనుష్క పెళ్లి?.. క్లారిటీ!

ఈ ఏడాదే అనుష్క పెళ్లి?.. క్లారిటీ!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- సోషల్ మీడియాలో నిత్యం ప్రతిరోజు కూడా ఎన్నో వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని వార్తలు నిజమై ఉంటాయ్ మరి కొన్ని వార్తలు పక్కాగా ఫేక్ అయి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సంవత్సరంలోనే హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి జరగబోతుంది అని ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టాయి. ఈ విషయంపై తన టీమ్ స్పందిస్తూ అవన్నీ ఫేక్ వార్తలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి అనుష్క శెట్టి పెళ్లి ప్రచారంలో ఎటువంటి నిజం లేదు అని ప్రకటించారు. తమ నుంచి అధికారికంగా సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను సోషల్ మీడియాలో పబ్లిష్ చేయద్దు అని మీడియాను వేడుకుంది. అనుష్కకు సంబంధించిన ప్రైవసీ విషయాలను ప్రతిరోజు కూడా బయటకు లాగడం ఆమెపై ప్రైవసీకి భంగం కలిగించడమే అని పేర్కొంది. పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి పెళ్లి విషయాన్ని ఇలా సోషల్ మాధ్యమంలోకి లాగి ప్రతిరోజు కూడా రూమర్స్ సృష్టించడం అనేది సరైన పద్ధతి కాదని తెలిపారు. దీంతో ఈ సంవత్సరంలో కూడా అనుష్క పెళ్లి జరిగే అవకాశం లేదు అని స్పష్టంగా అర్థం అవుతుంది. మరోవైపు ప్రభాస్ అభిమానులు సైతం ప్రభాస్ కు పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్… షో చూసినా ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసా?

Deve Gowda: ప్రేమ కాదు బలవంతపు పెళ్లి.. ఖర్గే వ్యాఖ్యలకు దేవెగౌడ దిమ్మదిరిగే కౌంటర్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు