Homeసినిమాఉస్తాద్ భగత్ సింగ్... షో చూసినా ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసా?

ఉస్తాద్ భగత్ సింగ్… షో చూసినా ప్రేక్షకులు ఏమంటున్నారో తెలుసా?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఈరోజు గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పటికే బెనిఫిట్ షో చూసినటువంటి కొంతమంది ప్రేక్షకులు సినిమాపై పలు రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పదునైన డైలాగ్స్ అలాగే డాన్స్ తో ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకుంటారు అని అంటున్నారు. సినిమా మొత్తంగా పవన్ కళ్యాణ్ ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంది అని చెబుతున్నారు. మరి ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వాగ్ మరియు డాన్స్ స్టైల్ చూస్తే పూనకాలు రావడం పక్కా అంటున్నారు. మరోవైపు కొంతమంది మాత్రం ఈ సినిమాలో కొత్తదనం లేకపోవడం నిజమైన సినిమా ప్రేక్షకులకు కాస్త నిరాశ పరుస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైతేనే పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఇక చివరి సినిమాగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని క్రియేట్ చేస్తుంది అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

Eggs Expiry Date: ఇక గుడ్లపైనా ఎక్స్‌ పైరీ డేట్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

సీఎస్ఆర్ నిధులతో సైకిళ్ల పంపిణీ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు