Homeరాజకీయంతమిళనాడు రాజకీయాల్లో త్రిష చక్రం తిప్పుతుందా..?

తమిళనాడు రాజకీయాల్లో త్రిష చక్రం తిప్పుతుందా..?

క్రైమ్ మిర్రర్,రాజకీయం:- తమిళనాడులో రాజకీయాలు ప్రతిరోజు కూడా వాడి వేడిగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా తమిళనాడు రాజకీయాలలో త్రిష కీలక పాత్ర పోషిస్తుంది అని ఎన్నో వార్తలు వస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం హీరోయిన్ త్రిష చుట్టూనే తిరుగుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే త్రిష.. విజయ్ టీవీకె పార్టీలో చేరబోతుంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకోసం ఇప్పటినుంచి సినిమాలకు సైన్ చేయకుండా కామ్ గా ఉంటూ.. తమిళనాడు రాజకీయాల్లో లోతైన విశ్లేషణ చేసింది అని వార్తలు వస్తున్నాయి. విజయ్ భార్యతో విడాకులు సెటిల్మెంట్ తర్వాత త్రిషను విజయ వివాహం చేసుకుంటారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు విజయ్ టీవీకే పార్టీ ఎన్డీఏతో పొత్తు నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉంది అంటూ ఎన్నో విధాలుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల అమిత్ షా తో త్రిష భేటీ అవ్వడమే ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది అని అర్థమవుతుంది. త్వరలోనే తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు తప్పేలాగా కనిపించడం లేదు. దీంతో తమిళ రాష్ట్ర రాజకీయాలని కూడా త్రిష చుట్టూనే తిరుగుతుండడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఈమె పేరే ఎక్కువగా వినిపిస్తుంది.

ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం : మంత్రి పొంగులేటి

కొత్త పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు