Wednesday, March 18, 2026
Homeఅంతర్జాతీయంఇరాన్ కోలుకోవ‌డానికి ప‌దేళ్లు ప‌డుతుంది: ట్రంప్‌

ఇరాన్ కోలుకోవ‌డానికి ప‌దేళ్లు ప‌డుతుంది: ట్రంప్‌

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: ప‌శ్చిమాసియా బాంబులు, మిస్సైళ్ల‌తో అట్టుడుకుతుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు తీవ్ర‌రూపం దాల్చాయి. ఈ దాడుల‌తో టెహ్రాన్ న‌గ‌రం తీవ్రంగా న‌ష్ట‌పోయింది. జ‌న‌వాసాలు, అణుస్థావ‌రాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్దం పై కీల‌క వాఖ్య‌లు చేశారు. ఇరాన్‌పై కొనసాగుతున్న తమ సైనిక చర్యలు చాలా బాగా సాగుతున్నాయని, వాటివల్ల కలిగిన నష్టాన్ని పునర్నిర్మించడానికి ఇరాన్‌కు కనీసం ఒక పదేళ్లు పట్టవచ్చని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

‘ఇరాన్‌పై యుద్ధం చాలా బాగా సాగుతోంది. వారి(ఇరాన్) వద్ద అణ్వాయుధాలు ఉండనివ్వకూడదు. భవిష్యత్‌లో వారి నుంచి ఎవరికీ అణుముప్పు రాకూడదనేదే మా లక్ష్యం. మరో రెండు వారాల పాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. మేము ముందస్తు దాడులు ప్రారంభించకపోయి ఉంటే ఇరాన్ ఈ పాటికి పలు అణ్వాయుధాలను అభివృద్ధి చేసేది’ అని ట్రంప్ తెలిపారు.

ఇరాన్‌కుశాశ్వ‌త నష్టం కలిగించడానికి మేము మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడే యుద్ధాన్ని ఆపేసినా ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి అక్కడి పాలకులకు 10 ఏళ్ల సమయం పడుతుంది. కానీ మరే ఇరాన్ అధ్యక్షుడు ఇలాంటి సాహసం చేసేందుకు ధైర్యం చేయకుండా, అలానే మళ్లీ కోలుకోలేనివిధంగా అక్కడి నేతలకు నష్టం కలిగించాలన్నదే మా ఉద్దేశం’ అని ట్రంప్ వెల్లడించారు. కాగా నాటోతో పాటు మిత్ర‌దేశాలు యుద్ద నౌక‌లు పంప‌క‌పోవ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఐనా మేము త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments