ప్రముఖ నటుడు మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి తనదైన శైలిలో నటిగా గుర్తింపు పొందారు. ఒకప్పుడు నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించిన ఆమె, ప్రస్తుతం పూర్తిగా నటనపైనే దృష్టి సారించారు. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం అందుకోవడం కష్టమవుతోంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె కుమార్తె విద్యా నిర్వాణ ఓణీల వేడుకకు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మార్చి 15న నిర్వహించిన ఈ వేడుకను మంచు లక్ష్మి ఎంతో అంగరంగ వైభవంగా జరిపించినట్లు సమాచారం. ఈ ఫోటోలలో విద్యా నిర్వాణ సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మి లేదా కుటుంబ సభ్యులు అధికారికంగా షేర్ చేయకపోయినా.. అవి బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంచు కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.
మంచు లక్ష్మికి విద్యా నిర్వాణ ఏకైక సంతానం అనే విషయం తెలిసిందే. ఈ చిన్నారికి ఆమె సరోగసి ద్వారా జన్మనిచ్చారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరిగినప్పటికీ విద్యా నిర్వాణ ఇప్పటివరకు సినిమాలకు దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం విదేశాల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. చిన్న వయసులోనే విద్యా నిర్వాణ చెస్ ట్రైనర్‌గా గుర్తింపు పొందడం. ఈ వయసులోనే ప్రతిభ కనబరుస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. భవిష్యత్తులో ఆమె కూడా తన తల్లి మార్గంలో నడుస్తారా లేదా పూర్తిగా వేరే రంగాన్ని ఎంచుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వేడుక ఫోటోలు చూసిన అభిమానులు “పాప చాలా క్యూట్‌గా ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా మంచు లక్ష్మి కుటుంబానికి చెందిన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ALSO READ: పాటలో పచ్చి బూతులు.. వివాదంలో మంగ్లీ
