Tuesday, March 17, 2026
Homeతెలంగాణచౌటుప్పల్ మైనార్టీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

చౌటుప్పల్ మైనార్టీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

•విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారాన్ని అందించాలి
•చౌటుప్పల్ మైనార్టీ గురుకుల పాఠశాల కలెక్టర్ ఆకస్మిక తనిఖీ….
•విద్యార్థులు మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించాలి…
•విద్యార్థుల డార్మెంటరీ హాల్ పరిశీలన….
•పది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్….

చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్:- ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెనూ ప్రకారం మంచి రుచికరమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.సోమవారం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని, విద్యార్థులకు బోధించేందుకు ఎంతమంది టీచర్లు ఉన్నారని ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని, ఎప్పటికప్పుడు తాజాగా ఉన్న కూరగాయలు మాత్రమే వంటకు ఉపయోగించాలన్నారు. విద్యార్థులకు భోజనం వడ్డించే ముందు అధికారులు తప్పనిసరిగా రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు వడ్డించాలన్నారు. పాఠశాల వంటగదిని పరిశీలించి విద్యార్థులకు వండుతున్న భోజనాన్ని స్వయంగా ఆయన పరిశీలించారు. విద్యార్థుల డార్మిటరీ హాల్ ను కలెక్టర్ పరిశీలించి గదిలో సీలింగ్ ఫ్యాన్లు అన్ని పని చేస్తున్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లను పరిశీలించగా టాయిలెట్స్ పరిశుభ్రంగా లేవని,తలుపులు కూడా సరిగా లేవని వెంటనే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.అనంతరం 10వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ… పరీక్షలు జరుగుతున్నందున కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించాలని,వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచనలు చేశారు. పరీక్షలు వ్రాసే సమయంలో భయాందోళనకు గురి కాకుండా మంచి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయాలన్నారు.10 వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ద్వారా భవిష్యత్ లో ఉన్నత చదువులకు వెళ్ళవచ్చని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్కులతో పాస్ అవ్వాలని కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలకృష్ణ, సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

యుద్ధ ప్రభావంతో అన్నిట్లోనూ మార్పులు వస్తున్నాయి : సీఎం చంద్రబాబు

సాగు మరియు తాగునీటి కోసం మునుగోడు లో భారీ ర్యాలీ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments