Sunday, March 15, 2026
Homeఅంతర్జాతీయంTrump: ‘హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపండి

Trump: ‘హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపండి

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇరాన్ ప్రస్తుతం లొంగిపోవడానికి సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల కారణంగా ఇరాన్ తీవ్ర ఒత్తిడికి గురైందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిని రక్షించేందుకు ఇతర దేశాలు తమ యుద్ధనౌకలను పంపాలని ఆయన కోరారు. త్వరలోనే అమెరికా నౌకాదళం ఈ జలసంధి గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లకు రక్షణగా ఉండే చర్యలు ప్రారంభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం 16వ రోజుకు చేరుకున్న సమయంలో ఆయన చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇరాన్ సైనిక శక్తి దాదాపు పూర్తిగా దెబ్బతిన్నదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ తీవ్రంగా నష్టపోయిందని కూడా ఆయన అన్నారు. అయినప్పటికీ ఒకటి లేదా రెండు మానవరహిత విమానాలను పంపడం లేదా చిన్నపాటి మందుపాతరలను ఉపయోగించడం ద్వారా ప్రపంచాన్ని భయపెట్టాలని ఇరాన్ ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు. హార్ముజ్ జలమార్గంలో ఎక్కడైనా క్షిపణిని ప్రయోగించడం చాలా సులభమని కూడా ఆయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ప్రధాన దేశాలు ఈ ప్రాంత భద్రత కోసం ముందుకు రావాలని ట్రంప్ కోరారు. ముఖ్యంగా చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి దేశాలు తమ నౌకాదళాన్ని ఈ ప్రాంతానికి పంపాలని ఆయన సూచించారు. అలా చేస్తే హార్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి ముప్పుగా మారదని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

ఇదిలావుంటే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తీవ్రంగా స్పందించారు. మధ్యప్రాచ్య దేశాలు తమ ప్రాంతాల్లో ఉన్న విదేశీ సైనిక దళాలను వెంటనే బయటకు పంపాలని ఆయన పిలుపునిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా అరాఘ్చి స్పందించారు. అమెరికా ప్రోత్సహిస్తున్న భద్రతా దళాలను తొలగించకపోతే ఈ ప్రాంతంలో ఉన్న సంక్షోభం తగ్గడం బదులు మరింత పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని రక్షించేందుకు అమెరికా ఇతర దేశాలను కోరుతుండటం పరిస్థితి తీవ్రతను చూపుతోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తన పొరుగు దేశాలకు విదేశీ ఆక్రమణ దళాలను బహిష్కరించాలని పిలుపునిచ్చినట్లు కూడా తెలిపారు.

ఇదిలావుంటే ఇరాన్‌కు చెందిన కీలక చమురు ఎగుమతి కేంద్రం ఉన్న ఖార్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. అక్కడ ఉన్న సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. ఇరాన్ హార్ముజ్ జలసంధి గుండా నౌకా రవాణాను అడ్డుకునే ప్రయత్నాలు కొనసాగిస్తే దేశంలోని చమురు మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధ ఉద్రిక్తతల మధ్య మార్చి 1న ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లు సమాచారం. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన మార్గాల్లో ఇదొకటిగా పరిగణించబడుతుంది. సాధారణంగా ఈ మార్గం ద్వారా రోజుకు దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుంది. ప్రపంచ సహజ వాయువు వ్యాపారంలో దాదాపు 20 శాతం వాటా కూడా ఈ మార్గం ద్వారానే జరుగుతుందని అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి.

ALSO READ: రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్ని హార్థిక్ పాండ్యా

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments