భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు
బీజాపూర్, క్రైమ్ మిర్రర్: మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను తీసుకొచ్చింది. దీంతో మావోయిస్టులకు తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌లోని నార్త్ బస్తర్ కోయిల్ బేడలో భద్రత దళాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఒకరిపై ఒకరు భీకరమైన కాల్పులు జరుపుకున్నారు.
మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రత దళాలు కుంబీంగ్ చేపట్టాయి. గురువారం రాత్రి అనుమానిత ప్రదేశాన్ని చుట్టుముట్టగానే మావోయిస్టులు కాల్పులు జరుపంతో భద్రత సిబ్బంది ఎదురు కాల్పులు జరిపినట్లు కాంకెర్ ఎస్పీ రఖేచా తెలిపారు.
ఈ క్రమంలో చీకటి పడడంతో మావోయిస్టులు పారిపోయారు. కాగా కాల్పులు జరిగిన ప్రదేశంలో మావోయిస్టుల సాహిత్యం, రోజు వారి వినియోగించే వస్తువులు లభించినట్లు తెలిపారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతున్నట్లు తెలిపారు. పారిపోతున్న మావోయిస్టులను పట్టకునేందుకు అదనంగా బృందాలను దించినట్లు ఎస్పీ తెలిపారు. కాగారోడ్డులను సైతం దిగ్బంధించినట్లు పేర్కొన్నారు.
