HomeజాతీయంGood News for Farmers: అన్నదాతలకు గుడ్ న్యూస్, పీఎం కిసాన్ డబ్బులు వచ్చేస్తున్నాయ్!

Good News for Farmers: అన్నదాతలకు గుడ్ న్యూస్, పీఎం కిసాన్ డబ్బులు వచ్చేస్తున్నాయ్!

*అన్నదాతలకు కేంద్రం శుభవార్త

* ఈ నెల 13న రైతుల ఖాతాల్లో డబ్బులు

దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 22వ విడత నిధులను ఈ నెల 13న విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నేరుగా జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఈ నిధులను అస్సాంలోని గువాహటిలో నిర్వహించే కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

రూ.19 వేల కోట్లకు పైగా నిధులు విడుదల

పీఎం కిసాన్ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మూడు విడతలుగా రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. రైతుల వ్యవసాయ ఖర్చులకు కొంత ఉపశమనం కలిగించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఏడాది ఈ పథకం కింద మొత్తం రూ.19 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

 గత ఏడాది నవంబర్ 19న నిధులు విడుదల

ఇక గత ఏడాది నవంబర్ 19న 21వ విడత నిధులు విడుదల అయ్యాయి. పీఎం కిసాన్ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 21 విడతల ద్వారా రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 11 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.

ఏపీలో ‘అన్నదాత సుఖీభవ’ కూడా..

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పీఎం కిసాన్‌తో పాటు ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు అదనపు ఆర్థిక సహాయం అందిస్తోంది. రాష్ట్ర రైతులకు మరింత ప్రయోజనం కలుగుతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు