క్రైమ్ మిర్రర్ (రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో అక్రమ ఇసుక దందా వ్యవహారం రోజురోజుకు మరింత వివాదాస్పదంగా మారుతోంది. గ్రామంలో ఇసుక తవ్వకాల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరిట ఇసుక ట్రాక్టర్ల వద్ద మామూళ్లు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
గ్రామంలో నిర్మాణ పనుల కోసం తీసుకెళ్తున్న ఇసుక ట్రాక్టర్ల నుంచి కూడా డబ్బులు వసూళ్ళు చేస్తున్నట్లు సమాచారం.ఇసుక తవ్వకాలు, మైనింగ్ వ్యవహారాలతో పాటు పంచాయతీ ధ్రువీకరణ పత్రంలో కూడా లక్షల రూపాయలు వసూలు చేసినట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి పంచాయతీ కార్యదర్శే మూల కారకుడని స్థానికులు అంటున్నారు.
ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి నిజానిజాలు వెలికితీయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరో కథనం లో పంచాయతీ కార్యదర్శి అక్రమాలపై ఆధారాలతో మీ ముందుకు. .
