Friday, March 6, 2026
Homeతెలంగాణఇంజ‌నీరింగ్ కాలేజీల ట్యూష‌న్ ఫీజులు ఖ‌రారు

ఇంజ‌నీరింగ్ కాలేజీల ట్యూష‌న్ ఫీజులు ఖ‌రారు

  • 33 కాలేజీల్లో ఫీజు ల‌క్ష‌కు పైనే….

  • 70 కాలేజీల్లో పాత ఫీజులే కొన‌సాగ‌నున్నాయి

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: తెలంగాణ‌లోని 160 కాలేజీల‌కు కొత్త ట్యూష‌న్ ఫీజును ఖ‌రారు చేస్తూ గురువారం విద్యాశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. 33 కాలేజీల్లో ఫీజులు ల‌క్ష దాట‌గా, 70 కాలేజీల్లో పాత ఫీజులు కొన‌సాగనున్నాయి. కాగా 19 కాలేజీల్లో కొంచం ఫీజులు తగ్గాయి.

కాగా 21 క‌ళాశాల్ల‌లో మినిమం ఫీజుల రూ.45వేలుగా నిర్ణ‌యించారు. ఫీజులు త‌గ్గిన కాలేజీల్లో అద‌నంగా చెల్లించిన ఫీజు డ‌బ్బుల‌ను యాజ‌మ‌న్యాలు తిర‌గి చెల్లించాల్సి ఉంటుంది. ప్ర‌క‌టించిన ఫీజులు 2025-28 ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు సంబంధించి బ్లాక్ పీరియ‌డ్‌కు వ‌ర్తించ‌నున్న‌ట్లు తెలిఆరు. మూడెళ్ల బ్లాక్ పీరియ‌డ్ అంటే 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాల్లో బీటెక్‌ ఫస్టియర్‌లో చేరినవారికి ఈ కొత్త ఫీజులు వర్తిస్తాయి.

సీబీఐటీ కాలేజీ్ ఫీజు రూ..1.83ల‌క్ష‌లు…
ఇంజ‌నీరింగ్ క‌ళాశాలల్లో అత్య‌ధికంగా సీబీఐటీ ఇంజ‌నీరింగ్ కాలేజీకి ఫీజు రూ.1.83ల‌క్ష‌ల‌గా విద్యాశాఖ అధికారులు నిర్ణ‌యించ‌గా, వాస‌వి కాలేజీ రూ.1.75ల‌క్ష‌తో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ 19 కాలేజీలకు ట్యూషన్‌ ఫీజులను తగ్గించడంతోపాటు 70 కాలేజీలకు ఒక్క రూపాయి కూడా పెంచకుండా సర్కార్‌కు సిఫార్సు చేసింది. ఈ మేరకు ఆ సిఫార్సుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ కొత్త ట్యూషన్ ఫీజులు ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచే అమల్లోకి వస్తాయి.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments