HomeజాతీయంPawan Kalyan: ఏంటీ.. ‘గుడుంబా శంకర్’ ప్యాంటు ఆయన దగ్గర ఉందా?.. ఇదెక్కడి మాస్‌రా మామ!

Pawan Kalyan: ఏంటీ.. ‘గుడుంబా శంకర్’ ప్యాంటు ఆయన దగ్గర ఉందా?.. ఇదెక్కడి మాస్‌రా మామ!

Pawan Kalyan: ఇప్పటిలా సోషల్ మీడియా లేకపోయిన రోజుల్లో హీరోల స్టైల్ అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఎవరి సినిమా రిలీజ్ అయినా, వారు వేసుకున్న డ్రెస్‌లు, హెయిర్ స్టైల్, గెటప్ గురించి రోజులు తరబడి మాట్లాడుకునేవారు. అలాంటి చర్చలకు కారణమైన వాటిలో ఒకటి గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కల్యాణ్ వేసిన స్పెషల్ ప్యాంట్. ఆ ప్యాంట్ అప్పట్లో నిజంగానే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఆ ప్యాంట్ ధర సుమారు రూ.1.40 లక్షలు అని ప్రచారం రావడంతో యూత్‌లో మరింత హైప్ ఏర్పడింది. “లక్ష రూపాయల ప్యాంట్‌రా!” అంటూ అభిమానులు గర్వంగా చెప్పుకునేవారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఈ కాస్ట్యూమ్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ఇదే తరహాలో బాలు సినిమా సమయంలో కూడా ఆయన డిఫరెంట్ స్టైల్‌ను ట్రై చేశారు. అప్పట్లో హీరో కాస్ట్యూమ్ ఖర్చు ఇంతగా చర్చకు రావడం అరుదు కావడంతో ఈ విషయం పెద్ద టాపిక్ అయింది.

ఆ స్పెషల్ ప్యాంట్ ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ దగ్గర ఉందని సినీ వర్గాల్లో ప్రచారం ఉంది. అంతేకాదు ఆయన నటించిన రేయ్ సినిమాలో కూడా ఆ ప్యాంట్ ఉపయోగించారనే వార్తలు వినిపించాయి. ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన కాస్ట్యూమ్ మరో తరం హీరో వద్ద ఉండటం అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

గుడుంబా శంకర్ సినిమాకు వీర శంకర్ దర్శకత్వం వహించగా, అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగేంద్ర బాబు నిర్మించారు. హీరోయిన్‌గా మీరా జాస్మిన్ నటించింది. సుమారు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద హిట్ కాకపోయినా, పవన్ అభిమానులకు మాత్రం కల్ట్ మూవీగా మారింది. ముఖ్యంగా మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, మరోవైపు సినిమాల్లో కూడా కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన OG మంచి వసూళ్లు సాధించగా, ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఒక ప్యాంట్‌తోనే అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన పవన్ స్టైల్ ఇప్పటికీ అభిమానుల్లో క్రేజ్ కొనసాగిస్తూనే ఉంది.

ALSO READ: Telangana: నేడు ‘హెల్త్ మిషన్ – 100’ ప్రారంభం.. అసలేం చేస్తారు?

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు