Friday, February 27, 2026
HomeUncategorizedలిక్క‌ర్‌కేసులో కేజ్రీవాల్ డిశ్చార్ఝ్‌..!

లిక్క‌ర్‌కేసులో కేజ్రీవాల్ డిశ్చార్ఝ్‌..!

  • మోడీ, అమిత్ షాల కుట్రకు బలయ్యా
  • నేను నిర్దోషినని కోర్టు నిరూపించంది
  • నన్ను దొంగగా చిత్రీకరించి ప్రచారం చేశారు
  • కోర్టు తీర్పుతో ఉద్వేగానికి లోనైన కేజ్రీవాల్

న్యూఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: కోర్టు తీర్పు అనంత‌రం కేజ్రీవాల్ బావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్న తనను ఆరు నెలలపాటు జైల్లో పెట్టి అనేక ఇబ్బందుల‌కు గురి చేశార‌ని కేజ్రీవాల్ అన్నారు. కోర్టు తీర్పు అనంత‌రం ఆయ‌న క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాఆరు. రాజకీయంగా తనను దెబ్బతీయడంతో పాటు ’ఆప్‌కు చెందిన ఐదుగురు నేతలను జైల్లో పెట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదంతా మోడీ, అమిత్‌షాల కుట్ర‌లో భాగమే అని మండిప‌డ్డారు.

నా జీవితంలో ఎన్న‌డూ త‌ప్పుచేయ‌లేద‌న్నారు.నాపై అనేక త‌ప్ప‌డు కేసులు పెట్టార‌ని అన్నారు. నేను నిజాయితీగా ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేసే వ్య‌క్తిన‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తంచేశారు. నిజం అనేది ఎప్ప‌టికైన గెలుస్తుంద‌ని క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశ‌నం చేయ‌డానికే కేసుల్లో ఇరికించార‌న్నారు.

తాను ఆరు నెలలు జైలులో ఉన్నానని, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు రెండు సంవత్సరాలు జైలులో గడిపారని తెలిపారు. ఈ లిక్కర్ వ్యవహారం కల్పితమని, తన ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా దుష్పచ్రారం చేస్తున్నారని కేజీవ్రాల్ అన్నారు. టీవీ ఛానెళ్లలో తనను పదే పదే అవినీతిపరుడిగా చిత్రీకరించారని కన్నీరుమున్నీరుగా విలపించారు.

లిక్క‌ర్‌కేసులో స‌రైన ఆధారాలు లేవు…
లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

భారీ ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్‌మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. సిసోడియాపై ప్రాథమికంగా కేసు కూడా నిలబడలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అరవింద్ కేజీవ్రాల్, మనీష్ సిసోడియా లను కోర్టు డిశ్చార్జ్ చేసింది. కేజీవ్రాల్‌ను సరైన ఆధారాలు లేకుండా ఇరికించారని జడ్జి వ్యాఖ్యలు చేశారు.

క‌విత‌కు క్లీన్ చిట్‌…
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కొట్టివేసింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్ప్పు చేశారన్న సాక్ష్యా దారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.

. .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments