Homeఆంధ్ర ప్రదేశ్ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

తిరుపతి, క్రైమ్ మిర్ర‌ర్:మోహన్ బాబు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవ‌డం ఆ ప్రాంతం ఒక్క‌సారిగా ఉలిక్కిపడింది, కాగా విద్య‌ర్థినులు ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి కార‌ణాలు ఏంట‌నే ప‌లు ర‌కాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.వివ‌రాల్లోకి వెళితే చంద్రగిరి మండలం, రంగంపేటలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఘటన చోటు చేసుకుంది.

మృతురాలు పుంగనూరు నియోజకవర్గం లోని మంగళం కు చెందిన విద్యార్థి భువన మోహన్ బాబు యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫైనల్ ఇయర్ బీటెక్ చదువుతోంది. విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ అన్నారు.

తాజావార్తలు