Homeతెలంగాణచత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో ధర్మరక్షణ సంకల్పం : రాఘవేంద్ర

చత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో ధర్మరక్షణ సంకల్పం : రాఘవేంద్ర

క్రైమ్ మిర్రర్, మణికొండ : దేశం కోసం, ధర్మం కోసం అహర్నిశలు పోరాడిన చత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిని నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని గురువారం శివాజీ మహారాజ్ జన్మదిన సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త కొవ్వూరి రాఘవేంద్ర పేర్కొన్నారు. గచ్చిబౌలి రాయదుర్గంలో నిర్వహించిన శివాజీ శోభాయాత్రలో పాల్గొన్న రాఘవేంద్ర మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ కేవలం ఒక రాజు మాత్రమే కాకుండా హైందవ ధర్మరక్షణకు అఖండ సంకల్పంతో నిలిచిన మహాయోధుడని తెలిపారు.

ఆయన పరిపాలనలో ప్రజల రక్షణ, స్త్రీల గౌరవం, సాంస్కృతిక పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు. విదేశీ ఆక్రమణలకు ఎదురొడ్డి స్వరాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజ్ ధైర్యం, వ్యూహపటిమ నేటి యువతకు మార్గదర్శకమని రాఘవేంద్ర పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చూపిన త్యాగస్ఫూర్తి మనకు ఆదర్శం. అఖండ హైందవ భావజాలంతో సమాజాన్ని ఐక్యంగా ఉంచి, సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ జీవిత గాథను స్మరించుకుంటూ యువతలో దేశభక్తి, ధర్మభక్తి పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. సమాజ శ్రేయస్సు, న్యాయం, పరిపాలనా పారదర్శకత, ఇవన్నీ శివాజీ మహారాజ్ చూపిన మార్గంలోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

Most Popular

Recent Comments