Homeక్రైమ్Actress Private Video: ప్రైవేట్ వీడియో తీసి, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి.. నటికి...

Actress Private Video: ప్రైవేట్ వీడియో తీసి, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి.. నటికి దారుణ అనుభవం!

  • బెంగళూరుకు నటికి దారుణ అనుభవం

  • ఆమె ప్రైవేట్ వీడియో తీసి బెదిరింపులు

  • బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి

ఇండోర్ స్టేడియంలో ఈవెంట్‌కు వెళ్లిన 32 ఏళ్ల కన్నడ నటికి దారుణమైన అనుభవం ఎదురైంది. కొందరు ఆగంతకులు ఆమె ప్రైవేట్ వీడియో తీసి, బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు భరించలేకపోయిన నటి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది.

ఇంతకీ నటి ఏమని ఫిర్యాదు చేసిందంటే?

ఫిబ్రవరి 7న సదరు నటి ఓ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈవెంట్‌ కు వెళ్లింది. అక్కడ ఉమెన్స్ రెస్ట్‌ రూమ్‌ను ఊపయోగించింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆ రెస్ట్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి, వీడియోను చిత్రీకరించారు.

Read Also:ఇకపై అలా చేస్తే విమానం ఎక్కనీయరట, ఆ తప్పు మీరూ చేయకండి!

ఆ వీడియోను అడ్డుపెట్టుకుని నటిపై బెదిరింపులకు దిగారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా డబ్బులు డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. వారి వేధింపులు రోజురోజుకూ పెరగటంతో చివరకు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఉపయోగించి వారిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.

Read Also: బ్యాంకు ఉద్యోగి బరితెగింపు, లాకర్ల నుంచి కోట్ల విలువైన బంగారాన్ని కొట్టేసి..

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు