Homeక్రైమ్ఎంపి కావ్యపై ఎన్నికల సంఘానికి పిర్యాదు

ఎంపి కావ్యపై ఎన్నికల సంఘానికి పిర్యాదు

హైదరాబాద్,క్రైమ్ మిర్ర‌ర్: కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య డబుల్ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు సోమ‌వారం ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ సభ్యురాలు లలితా రెడ్డి మాట్లాడుతూ వరంగల్ ఎంపీగా ఉన్న‌ కావ్య వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫిషియో మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

మళ్ళీ తొర్రూరులో ఎక్స్ అఫిషియో మెంబర్ గా నమోదు చేయించుకున్నార‌ని ఇదీ ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న‌కు విరుద్ద‌మ‌ని దీనిపై రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదుచేశామ‌న్నారు.

ఎన్నిక‌ల‌కు 30 రోజుల ముందేనోటీసు ఇవ్వాలికాని అలా చేయ‌కుండా ఒక‌టిరెండు రోజుల్లోనే న‌మోదు చేయించుకొని ఓటువేయ‌డానికి సిద్ద‌మైంద‌ని ఇదీ న్యాయ‌ప‌రంగా చెల్ల‌ద‌న్నారు. బీఆర్ ఎస్ నేత కిషోర్ గౌడ్ మాట్లాడుతూ కావ్య‌కు వ‌రంగ‌ల్‌లో ఓటు ఉన్న‌ప్ప‌టికీ మ‌ళ్లీ రెండో ఓటు తొర్రూర్‌లో వేయ‌డానికిసిద్ద‌మ‌య్యార‌న్నారు. ఇది రాజ్యంగ నియామాల‌కు విరుద్ద‌మ‌న్నారు.

రాహుల్ గాంధీ రాజ్యాంగం ప‌ట్టుకొని దేశ‌మంతా తిరుగుతున్నార‌న్నారు. ఇక్క‌డ‌నేమో కాంగ్రెస్ నాయ‌కులు రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్నార‌న్నారు. ఈ విష‌యంపై ఎన్నిక‌ల సంఘం ఖ‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

Most Popular

Recent Comments