Wednesday, March 25, 2026
Homeరాజకీయంమిర్చి రైతుల ఆనందం

మిర్చి రైతుల ఆనందం

  • వండ‌ర్‌హాట్ ర‌కం మిర్చి క్వింటాల్‌కు రూ.38వేలు
  • వ‌రుస‌గా పెరుగుతున్న ధ‌ర‌లు

వరంగల్, క్రైం మిర్ర‌ర్ః

మిర్చి రైతులకు చాలాకాలం తరవాత మంచిరోజులు వ‌చ్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు. రైతు పండించిన పంట‌ల‌కు మంచి ధరలు పలుకుతున్నాయి.

కాగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఘాటెక్కుతున్నాయి.

గత రికార్డులను బ్రేక్ చేస్తూ వండర్‌హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.38వేల ధర పలికి రికార్డు సృష్టించింది.

కాగా గ‌త రెండు రోజుల్లో వండర్‌హాట్ మిర్చి రూ.37,100 ధర పలికి ఆల్‌టైం రికార్డు సృష్టించగా, ఒక్క రోజు వ్యవధిలోనే రూ.900 పెరిగి రూ.38వేలు పలకడం విశేషం.

వరుసగా రెండు రోజుల నుంచి మిర్చి ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వండర్‌హాట్, 341 రకాలను సాగు చేసిన రైతులకు ఇక లాభాల పండ‌గ‌నే చెప్ప‌వ‌చ్చు.

అలాగే యూఎస్ 341 రకం మిర్చికి రూ. 26,700, దీపిక రకం మిర్చికి రూ.27వేలు, తేజ రకం మిర్చికి రూ.19,500, పత్తికి రూ.7,630, మినుములకు రూ.8,602, పెసర్లకు రూ.8,352 గరిష్ఠంగా ధరలు పలికాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments