Homeతెలంగాణతెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు: నేడు ఉదయం నుంచి కొనసాగుతున్న ఓటింగ్

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు: నేడు ఉదయం నుంచి కొనసాగుతున్న ఓటింగ్

  • 25 సభ్యుల స్థానాల కోసం 203 మంది అభ్యర్థులు పోటీ
  • రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35,316 మంది న్యాయవాదులు ఓటు వేయడానికి అర్హులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: నేడు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, జనవరి 31 లోపు ఈ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. నేడు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు. హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ యతిరాజులు నేతృత్వంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35,316 మంది న్యాయవాదులు ఓటు వేయడానికి అర్హులు. మొత్తం 25 సభ్యుల స్థానాల కోసం 203 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి ఫిబ్రవరి 10, 2026న బార్ కౌన్సిల్ ప్రాంగణంలో జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు