Homeతెలంగాణమిర్యాలగూడ మునిసిపల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనమిర్యాలగూడ మునిసిపల్ నామినేషన్ కేంద్రాల పరిశీలన

మిర్యాలగూడ మునిసిపల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనమిర్యాలగూడ మునిసిపల్ నామినేషన్ కేంద్రాల పరిశీలన

మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్:- రాష్ట్రంలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడ మునిసిపల్ వార్డుల నామినేషన్ కేంద్రాలను బుధవారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్ పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చేపట్టిన ఏర్పాట్లు, హెల్ప్‌డెస్క్ పనితీరును పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా సాగేందుకు అవసరమైన సూచనలు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు అందించారు.
అభ్యర్థులు, ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జి. శ్రీనివాస్, తహసీల్దార్ పి. శ్రీనివాస్, డీఈఈ వెంకన్న, మేనేజర్, రెవిన్యూ ఆఫీసర్ జి. జ్ఞానశ్వరి, మాస్టర్ ట్రైనర్స్ బాలు, గుడిపాటి కోటయ్య పాల్గొన్నారు. అలాగే ఒన్, టూ టౌన్ ఇన్స్పెక్టర్లు నాగభూషణరావు, సోమనర్సయ్యల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

READ ALSO :-

Abhishek Sharma: కొత్త గెటప్‌లో కనిపించిన భారత స్టార్ ఓపెనర్.. ఫిదా అయిపోతున్న ఫ్యాన్స్

Cold Wave Deaths: మంచు దుప్పటిలో న్యూయార్క్.. ఇప్పటివరకు 10 మంది బలి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు