HomeతెలంగాణBreaking News: సర్పంచుల ప్రమాణ స్వీకారం వాయిదా..!

Breaking News: సర్పంచుల ప్రమాణ స్వీకారం వాయిదా..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. సర్పంచులు మరియు వార్డు సభ్యులు డిసెంబర్ 22, 2025 (సోమవారం) నాడు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మొదట డిసెంబర్ 20న ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
డిసెంబర్ 20న (శనివారం, పాడ్యమి) శుభ ముహూర్తాలు లేవని, ఆ రోజు బాధ్యతలు చేపట్టడం మంచిది కాదని పలువురు ప్రజా ప్రతినిధులు మరియు అభ్యర్థులు చేసిన విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ డిసెంబర్ 17న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది, నేడు (డిసెంబర్ 17) మూడో విడత ఫలితాలు వెలువడుతున్నాయి.
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు