Homeఅంతర్జాతీయంModi Jordan Visit: జోర్డాన్ కు చేరిన ప్రధాని, అమ్మాన్‌ లో ఘన స్వాగతం!

Modi Jordan Visit: జోర్డాన్ కు చేరిన ప్రధాని, అమ్మాన్‌ లో ఘన స్వాగతం!

PM Modi Jordan Visit:  ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన ప్రారంభంమైంది. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరిన ఆయన జోర్డాన్ కు వెళ్లారు.  తొలుత ఆయన జోర్డాన్ రాజధాని అమ్మాన్‌ కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు  భారతీయ సంతతి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. భారత జాతీయ జెండాను చేతబట్టి ప్రధాని మోడీకి నమస్కరించి స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వారిని ప్రేమతో పలుకరించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భారతీయ సంతతి భారత్-జోర్డాన్ సంబంధాలకు గణనీయమైన కృషి చేస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.

మూడు దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ మూడు దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటన ద్వారా ఆయా దేశాలతో పురాతన సంస్కృతిక సంబంధాలతో పాటు ఆధునిక ద్వైపాక్షిక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాలన్నది ప్రధాని పర్యటన ప్రధాన లక్ష్యం.

భారత్-జోర్డాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం

ప్రధాని మోడీ.. జోర్డాన్ సందర్శన భారత్-జోర్డాన్ దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతోంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ.. జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్, ఆ దేశ ప్రధాని జాఫర్ హసన్‌లతో భేటీ కానున్నారు. జోర్డాన్ పర్యటన అనంతరం ప్రధాని మోడీ ఇథియోపియా, ఒమన్ దేశాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవడంతో పాటు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు