Homeక్రైమ్హైదరాబాద్‌ ఎల్బీనగర్ ఎస్సై సంజయ్ సావంత్ మృతి..!

హైదరాబాద్‌ ఎల్బీనగర్ ఎస్సై సంజయ్ సావంత్ మృతి..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంజి: పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న ఎస్సై సంజయ్ సావంత్(60) గుండెపోటుతో మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యారక్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

నైట్ డ్యూటీలో  పోలీస్ స్టేషన్ బ్యారక్‌లో ఉన్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సహోద్యోగులు సమీపంలోని కామినేని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇటీవలి కాలంలో తెలంగాణలో పోలీసు అధికారులు మరణించిన సంఘటనలు తరాసు వింటున్నాము, నవంబర్ 2025లో, ఆర్థిక సమస్యల కారణంగా వరంగల్‌కు చెందిన స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ఆసిఫ్ ఆత్మహత్య చేసుకున్నారు.

అక్టోబర్ 2025లో, నిజామాబాద్‌లో ఓ దొంగను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్‌ను నిందితుడు కత్తితో పొడిచి చంపాడు. గతంలో (2024 డిసెంబర్ లో) కూడా ములుగు జిల్లాలో ఒక ఎస్సై సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు తెలిసినవే

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు