Homeతెలంగాణతెలంగాణలో మరో బస్సు ప్రమాదం..!

తెలంగాణలో మరో బస్సు ప్రమాదం..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పటాన్ చెరులోని ముత్తంగి గ్రామ సమీపంలో జాతీయ రహదారి 65పై ఈ ప్రమాదం జరిగింది.

ముందు వెళ్తున్న కార్లను తప్పించబోయే క్రమంలో, బస్సు బ్రేక్‌లు పనిచేయకపోవడంతో (బ్రేక్ ఫెయిల్) బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి ఢీకొట్టింది.

అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది, ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు.

Also Read:మరి ఇంత సన్నగా అయిపోయాడు ఏంటి.. యంగ్ టైగర్ కు ఏమయింది?

Also Read:మణికొండలో కాల్పుల కలకలం..!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు