Homeక్రైమ్మణికొండలో కాల్పుల కలకలం..!

మణికొండలో కాల్పుల కలకలం..!

క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని మణికొండ పంచవటి కాలనీలో భూ వివాదానికి సంబంధించి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు (తమ్ముడు) ప్రభాకర్, అతని అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య ఈ వివాదం జరిగింది. ఘర్షణ సమయంలో, కర్నూలుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి గాలిలోకి కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు.

అయితే, ఈ ఘటనపై డీజీపీ కార్యాలయం స్పందిస్తూ, వాస్తవానికి అక్కడ కాల్పులు జరగలేదని, కేవలం గన్‌తో బెదిరింపులకు పాల్పడ్డారని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Also Read:వికారాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం…ఒకరు మృతి

Also Read:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 న లోక్ అదాలత్

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు