Homeఆంధ్ర ప్రదేశ్బిగ్ బ్రేకింగ్ న్యూస్... శ్రీకాకుళంలో భారీ తొక్కిసలాట..9 మందికి చేరిన మృతుల సంఖ్య

బిగ్ బ్రేకింగ్ న్యూస్… శ్రీకాకుళంలో భారీ తొక్కిసలాట..9 మందికి చేరిన మృతుల సంఖ్య

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరగడంతో ఏకంగా 9 మంది మరణించారు అని సమాచారం. ఈ తొక్కిసులాటకు గల కారణం కార్తీకమాసం ఏకాదశి కావడంతో వైష్ణవుని ఆరాధన కోసం భక్తులు అంచనాలకు మించి తరలి రావడంతోనే జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ తొక్కిసలాట లో భాగంగా తొమ్మిది మంది మరణించగా మరింత మంది గాయపడినట్లు తెలుస్తుంది. మరి కొద్ది సేపట్లో మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానికులు వివరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమై అక్కడికి పైన మవుతున్నారు.

మరిన్ని వివరాలు మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ లో… త్వరలోనే

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు