Wednesday, March 4, 2026
Homeతెలంగాణమానవత్వం చాటిన బీఆర్ఎస్ నేత యాదగిరి గౌడ్

మానవత్వం చాటిన బీఆర్ఎస్ నేత యాదగిరి గౌడ్

క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో : మర్రిగూడ మండలం, ఇందుర్తి మేటి చందాపూర్ గ్రామానికి చెందిన ఊరుపక్క మల్లయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లయ్య పరిస్థితిని తెలుసుకున్న బీఆర్ఎస్ నేత అయితగోని యాదగిరి గౌడ్ సోమవారం ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మల్లయ్య కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అండగా నిలిచారు.

ఈ కార్యక్రమంలో వనం యాదగిరి, అయితగోని రఘు, అయితగోని గణేష్ తదితరులు పాల్గొన్నారు. సహాయానికి ముందుకు వచ్చిన నేతలకు మల్లయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు నాయకులు ముందుకు రావడం హర్షణీయమని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments