Wednesday, March 18, 2026
Homeక్రైమ్శోభనం కోసం ఒత్తిడి.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య!

శోభనం కోసం ఒత్తిడి.. భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య!

Maharashtra Crime: మేఘాలయ హనీమూన్ కేసు మరువక ముందే మరో ఘటన జరిగింది. మహారాష్ట్రలో ఓ భార్య భర్తను పెళ్లి అయిన 15 రోజులకే గొడ్డలితో నరికి చంపింది. శోభనం కోసం ఒత్తిడి చేయడంతో హంతం చేసినట్లు సదరు భార్యామణి వెల్లడించింది. ఈ ఘటన సాంగ్లీ జిల్లాలో సంచలనం కలిగించింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

53 ఏళ్ల అనిల్ లోఖండే‌ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్నాడు. తన కంటే వయసులో సగం తక్కువ అయిన రాధిక (27)ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరు కుప్వాద్ తెహ్‌సిల్ ప్రాంతంలో  ఉంటున్నారు. బుధవారం రాత్రి 12.30 సమయంలో భార్యాభర్త మధ్య శోభనం విషయంలో గొడవ అయ్యింది. శారీరంగా దగ్గరయ్యేందుకు అతడు ప్రయత్నించాడు. కానీ, ఆమె నిరాకరించింది. ఈ గొడవలో కోపంతో రెచ్చిపోయిన రాధిక, గొడ్డలితో భర్త మీద దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆయన కాసేపటికే చనిపోయాడు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లైన 15 రోజులకే అనిల్ చనిపోవడంతో అందరూ షాకయ్యారు. ప్రాణాలు తీసుకునేందుకే ఆయన పెళ్లి చేసుకున్నట్లు అయ్యిందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు.

భర్తలను చంపుతున్న భార్యలు

గత కొద్ది కాలంగా భార్యలను భర్తలు చంపుతున్న ఘటనలు పెరగడం పట్ల అందరూ షాకవుతున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ కేసులో భార్య సోనమ్ భర్తను చంపేందుకు కుట్ర చేయడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. పెళ్లికి ముందే ఆమె రాజ్ కుష్వాహ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయినప్పటికీ తండ్రి ఒత్తిడితో రాజా రఘువంశీని పెళ్లి చేసుకుంది. ఎలాగైనా అతడిని చంపేయాని భావించి షిల్లాంగ్ కు హనీమూన్ కు తీసుకెళ్లింది. అక్కడే తన లవర్ రాజ్ తో కలిసి హత్య చేయించింది. దోపిడీ దొంగలు అతడిని హత్య చేసినట్లుగా సీన్ క్రియేట్ చేయాలనుకుంది. కానీ, ఆ తర్వాత ఈ నేరం అతడి భార్యే చేసిందని అనుమానం కలగడంతో ఆదిశగా పోలీసులు విచారణ జరిపారు. అదే నిజం అని తేలింది. సోనమ్‌ తోపాటు ఆమె బాయ్‌ ‌ఫ్రెండ్ కుశ్వాహా, ఇతర నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ ఎంత పలుకుతున్నాయంటే?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments