Tuesday, March 17, 2026
Homeతెలంగాణమంగ్లీ బర్త్ డే వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి పట్టివేత!

మంగ్లీ బర్త్ డే వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి పట్టివేత!

Mangli’s Birthday Party: సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. తన పుట్టిన రోజు వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి వినియోగించారంటూ ఆమెతో పాటు పార్టీ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. చేవెళ్లలోని ఓ రిసార్టులో ఏర్పాటు చేసిన ఈ పార్టీపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. గంజాయితో పాటు విదేశీ మద్యాన్ని పట్టుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో పలువురికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినట్లు తెలుస్తోంది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

చేవెళ్ల మండలంలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి మంగ్లీ బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ పార్టీకి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురులు యువతీయువకులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఎస్ ఓ టీ పోలీసులు రిసార్టుపై దాడి చేశారు. ఈ రైడ్స్ లో పెద్ద మొత్తంలో గంజాయి, ఫారిన్ లిక్కర్ దొరికినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న పలువురికి పోలీసులు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొంత మందికి పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. ఈ వీరిలో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.

మళ్లీ డ్రగ్స్ కలకలం! : ఈ ఘటనతో మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం చెలరేగింది. ముఖ్యంగా యువతిలో డ్రగ్స్ వినియోగంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. అటు మంగ్లీ బర్త్ డే వేడుకలపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగ్లీ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించిన రిసార్ట్ మేనేజర్ పై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో నటి దివి, సినీ గాయకుడు కాసర్ల శ్యామ్ సహా పలువురు ఉన్నట్లు సమాచారం.విదేశీ మద్యం ఎలా వచ్చింది? ఎవరు సరఫరా చేశారు? గంజాయి ఎవరు? ఎక్కడి నుంచి తెచ్చారు? అనే అంశాలపై లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read Also: గాలి జైలుశిక్ష రద్దు, ఓబులాపురం మైనింగ్ కేసులో హైకోర్టు కీలక తీర్పు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments