Monday, March 16, 2026
Homeక్రైమ్హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది.
ఏప్రిల్ 27 న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై ఇటీవల ఈడీ రైడ్స్ జరిగాయి. సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో కీలక ఆధారాలను సేకరించారు ఈడీ అధికారులు. తమకు లభించిన వివరాలతో హీరో మహేష్ బాబును విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన వాణిజ్య ప్రకటనలకు మహేష్ బాబు రూ.5.9 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారు ఈడీ అధికారులు. అందులో రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అక్రమ పద్ధతిలో తీసుకున్నట్టు ఈడీ అధికారులకు ఆధారాలు లభించాయని సమాచారం. మహేష్ బాబు చేసిన ప్రకటనలను చూసి, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని తెలియక అనేకమంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు తన నోటీసులు పేర్కొన్నారు

రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ, డబ్బును అక్రమమైన పద్ధతిలో స్వీకరించినందుకు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments