టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలో తెలంగాణ సీఎంవోకు ఘోర అవమానం జరిగిందని తెలుస్తోంది. తెలంగాణ సీఎంఓ ఉద్యోగుల మీద బాలకృష్ణ వేడుక ఈవెంట్ ను ఆర్జనైజే చేసిన శ్రేయాస్ ఈవెంట్ నిర్వాహకులు దాడి చేశారని సమాచారం. హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం బాలకృష్ణ స్వర్ణోత్సవం జూబిలీ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ ను శ్రేయాస్ నిర్వహించింది.
సీఎం రేవంత్ రెడ్డిని బాలకృష్ణ ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్లింది సీఎంఓ చానల్ నిర్వహిస్తున్న ఏజెన్సీ సావీ మీడియా. లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోగా అడ్డుకున్నారు ఈవెంట్ నిర్వాహకులు. లైవ్‌కు అనుమతి లేదని చెప్పడంతో సీఎంఓ ఏజెన్సీ వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే సీఎంవో సిబ్బందిపై శ్రేయాస్ ఈవెంట్ నిర్వాహకులు దాడి చేశారని తెలుస్తోంది. చొక్కాలు విప్పి అరుణ్ అనే ఉద్యోగిపై దాడి చేశారని సమాచారం. దాడి ఘటన కారణంగానే బాలకృష్ణ ఈవెంట్‌కు రేవంత్ వెళ్లలేదని సమాచారం.చివరి నిమిషంలో ముఖ్యమంత్రి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని సీఎంవో వర్గాలు రహాస్యంగా ఉంచాయి.