ఢిల్లీ,క్రైమ్ మిర్రర్: ఇరాన్‌తో జరుగుతున్న యుద్దంలో అణ్వాయుధాలను వాడబోమని, కాని ఇరాన్‌కు సమయం ఆసన్నమైందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో తమతో ఒప్పందానికి రావాలని.. సమయం మించిపోతోందని టెహ్రాన్కు ఆయన హెచ్చరికలు చేశారు.
ఈ సందర్భంగా వైట్‌హౌజ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్ తో యుద్ధంలో అణ్వాయుధాలు వాడే ప్రణాళిక తనకు లేదని ట్రంప్ పేర్కొన్నారు. ‘నేను ఎందుకు అణ్వాయుధాన్ని ఉపయోగిస్తాను? అది లేకుండానే సంప్రదాయ యుద్ధ పద్ధతుల్లో మేము వారిని ఇప్పటికే నాశనం చేశాం. నేను దాన్ని ఉపయోగించను. అణ్వాయుధాన్ని ఉపయోగించడానికి ఎవరినీ, ఎప్పటికీ అనుమతించకూడదు’ అని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా టెహ్రా తో న్ఒప్పందానికి తాను తొందరపడటం లేదని ట్రంప్ పేర్కొన్నారు. త్వరిత పరిష్కారం కంటే స్థిరమైన, దీర్ఘకాలిక ఒప్పందం పైనే దృష్టిసారించినట్లు తెలిపారు. ఇటీవల ముగిసిన రెండు వారాల కాల్పుల విరమణలో ఇరాన్ తన ఆయుధ వ్యవస్థలను పునరుద్ధరించుకొని ఉండవచ్చన్నారు.