
క్రైమ్ మిర్రర్, క్రైమ్ న్యూస్:- ప్రస్తుత కాలంలో ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు ఏదో ఒక బెట్టింగ్ ప్రమోషన్ లో పాల్గొంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినటువంటి ఎన్నో యాప్స్ ను మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో మంది హీరోలు అలాగే ప్రముఖ నటులు వారి స్థాయిలో ప్రమోషన్స్ చేసుకువచ్చారు. అలాంటి సందర్భంలోనే ఎంతోమంది ప్రముఖ నటులపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో నోటీసులు అందుకున్నటువంటి వారిని గత రెండు రోజుల నుంచి అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్ను టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండను విచారించిన అధికారులు.. నేడు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సిఐడి విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు పలు ప్రశ్నలు అడిగేటువంటి ఆస్కారం ఉంది. అసలు బ్యాన్ అయినటువంటి యాప్స్ ను ఎలా ప్రమోట్ చేశారు? ప్రమోట్ చేసినందుకుగాను మీరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు?.. అసలు మీ మధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయి?.. వంటి తదితర అంశాలపై గంటపాటు ప్రశ్నలు వేయనున్నారు. మరోవైపు నేను చట్టబద్ధంగానే A 23 యాప్ ను ప్రమోట్ చేశానని.. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా విజయ్ దేవరకొండ పలుసార్లు అధికారులకు సమర్పించారు. మరి నేడు ప్రకాష్ రాజ్ ఈ ప్రశ్నలకు ఎటువంటి సమాధానం ఇస్తారో అని ఆసక్తికరంగా మారింది. అలాగే ఎటువంటి ఆధారాలు సమర్పిస్తారు అనేది కూడా ప్రశ్నగా మిగిలింది.
Read also : ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఛీ ఛీ అనేవారు.. ఇప్పుడు భలే భలే అంటున్నారు : సీఎం చంద్రబాబు
Read also : ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో సంచలనం.. డా. షాహీన్ అరెస్ట్!





