క్రీడలు

మహిళల ప్రపంచ కప్ లో రికార్డులు సృష్టించిన మహిళలు.. ఓపినర్స్ ఇద్దరూ సెంచరీలే!

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- మహిళల ప్రపంచ కప్ లో భాగంగా నేడు భారత్ మరియు న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత మహిళల ఓపినర్స్ ఇద్దరూ కూడా సెంచరీలు నమోదు చేసి రికార్డు సృష్టించారు. స్మృతి మందన, ప్రతీకారావల్ ఇద్దరు కూడా సెంచరీలు చేసి ఎన్నడూ లేని సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రతికా రావల్ 122(134), స్మృతి మందాన 109(95) ఇద్దరు కూడా 212 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. భారత మహిళా జట్టు మొట్టమొదటిసారిగా ఈ రికార్డును నమోదు చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 48 ఓవర్లకు గాను 329 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయారు. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిలిపివేయబడింది. ప్రస్తుతం గ్రీస్ లో జిమ్మీ రాడ్రిక్స్ 69, హర్మన్ ప్రీత్ కౌర్ పది పరుగుల వద్ద నాటౌట్ గా నిలిచారు. మరోవైపు ఆస్ట్రేలియా వన్డేల సిరీస్ లో భాగంగా ఈరోజు జరిగినటువంటి రెండవ వన్డే మ్యాచ్ లోను భారత్ ఘోర పరాజయం పాలయ్యింది. దీంతో వన్డే సిరీస్ ఇండియా కోల్పోయింది. ఈ మ్యాచ్ లోకి విరాట్ కోహ్లీ కూడా రెండవసారి డక్ ఔట్ అయ్యారు. మరోవైపు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ తో రాణించిన ఇండియా పరాజయం పొందింది. ఈ మూడు వన్డే ల సిరీస్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీకి కీలకం కానున్నాయి. కానీ రోహిత్ శర్మకు పర్వాలేదనిపించినా కోహ్లీ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.

Read also : మరోసారి తండ్రి కాబోతున్న రాంచరణ్.. వైరల్ అవుతున్న సీమంతం వేడుకలు

Read also : ఏపీలో కొత్త జిల్లాలకు రంగం సిద్ధం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button