
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం శీతాకాలం ఆరంభం అవుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా వివిధ ప్రదేశాలకు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నంలోని వ్యాలీ అందాలు పర్యాటకులను లాగేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అరకు, వంజంగి మరియు లంబసింగి వంటి ప్రాంతాలలో ఉదయం పూట భూతల స్వర్గం కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉదయం వేళ నుంచే ఎక్కువగా కొండల మధ్య మేఘాలు పాలనురగల కమ్ముకున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రదేశాలను వీక్షించడానికి సిద్ధమయ్యారు. ఉదయాన్నే అరకు, వంజంగి మరియు లంబసింగి ప్రాంతాలు ఒక స్వర్గం లా కనిపిస్తుండడంతో ఈ అద్భుతమైన దృశ్యాలను చూడడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అది కూడా వింటర్ సీజన్ కావడంతో అరకు అందాలను చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఈ ప్రదేశాలకు చేరుకుంటున్నారు. దీంతో ఈరోజు నుంచి ఇటువంటి స్వర్గం లాంటి ప్రదేశాలలో పర్యాటకుల హవా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పర్యాటకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇప్పటినుంచే వివిధ ప్రదేశాలను పర్యటించాలి అని అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు. పర్యాటకుల రాకతో ఈ ప్రదేశాలు మరింత వెలుగును రూపు దిద్దుకున్నాయి.
Read also : రేవంత్ తాటతీస్తామనగానే.. దిగివచ్చిన ప్రైవేటు కాలేజీల యాజమాన్యం!
Read also : గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. తన ప్రాణాలు అడ్డువేసి 8 మంది ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్లు!





